Telangana: జిల్లా అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ (బిజెపి) తెలంగాణలోని పలు జిల్లాలకు జిల్లా అధ్యక్షులను నియమించింది.
By అంజి Published on 3 Feb 2025 5:45 PM ISTTelangana: జిల్లా అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ (బిజెపి) తెలంగాణలోని పలు జిల్లాలకు జిల్లా అధ్యక్షులను నియమించింది.
కొత్తగా నియమితులైన నాయకుల జాబితా కింద ఉంది:
బీజేపీ జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే..
1.హైదరాబాద్- లంక దీపక్ రెడ్డి
2. జయశంకర్ భూపాలపల్లి - నిశిధర్ రెడ్డి
3.కామారెడ్డి- నీలం చిన్న రాజులు
4. హనుమకొండ-కొలను సంతోష్ రెడ్డి
5.వరంగల్-గంట రవి కుమార్
6.నల్గొండ-నాగం వర్షిత్ రెడ్డి
7.జగిత్యాల-రాచకొండ యాదగిరి బాబు
8.జనగామ-సౌడ రమేష్
9.నిజామాబాద్-దినేష్ కులాచారి
10.వనపర్తి-నారాయణ
11. మేడ్చల్ -శ్రీనివాస్
12.కుమురంభీం ఆసిఫాబాద్ - శ్రీశైలం ముదిరాజ్
13. ములుగు -బలరాం
14. మహబూబ్ నగర్-శ్రీనివాస్ రెడ్డి
15. మంచిర్యాల-వెంకటేశ్వర్లు గౌడ్
16.పెద్దపల్లి -సంజీవ రెడ్డి
17.ఆదిలాబాద్-బ్రహ్మానందరెడ్డి
18. సికింద్రాబాద్-భరత్ గౌడ్
రాబోయే రాజకీయ పరిణామాలకు ముందు తెలంగాణలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా ఈ ప్రకటన వచ్చింది. మరికొన్ని జిల్లాలకు అధ్యక్షుల నియామకంపై తెలంగాణ పార్టీ ఇంచార్జి సునీల్ బన్సల్, ఎన్నికల పరిశీలకులు అరవింద మీనన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిలు కేంద్ర నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఇతర జిల్లాల అధ్యక్షుల లిస్ట్ కూడా విడుదల కానుంది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై కూడా త్వరలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.