బీజేపీ నాలుగో జాబితా.. ఇంకా కొన్ని పెండింగ్‌లోనే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మరో జాబితా విడుదల చేసింది.

By Srikanth Gundamalla  Published on  9 Nov 2023 8:45 PM IST
bjp, 4th list, telangana, elections,

బీజేపీ నాలుగో జాబితా.. ఇంకా కొన్ని పెండింగ్‌లోనే..   

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మరో జాబితా విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన నాలుగో జాబితాలో ఆరుగురి పేర్లను ప్రకటించింది అధిష్టానం. ఇప్పటికే బీజేపీ మూడు విడతల్లో మొత్తం 88 మంది అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా ఆరుగురి పేర్లను వెల్లడించింది.

గురువారం బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల చేసింది. ఇప్పటికే ఆ పార్టీ మూడు విడతల్లో 88 మందిని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాక పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 8 స్థానాలను కేటాయించింది. మరో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మధిర, వికారాబాద్ , నర్సంపేట్, ఆలంపూర్, దేవరకద్ర స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి వుంది. మరోవైపు శుక్రవారం నాటికి నామినేషన్‌ దాఖలుకు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయానికి కల్లా మిగతా స్థానాల్లో కూడా బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీజేపీ నాలుగో జాబితాలో అభ్యర్థులు:

సికింద్రాబాద్ కంటోన్మెంట్ - కృష్ణ ప్రసాద్

నాంపల్లి - రాహుల్ చంద్ర

శేరిలింగంపల్లి - రవికుమార్ యాదవ్

మేడ్చల్ - రామచంద్రరావు

పెద్దపల్లి - ప్రదీప్ కుమార్

సంగారెడ్డి - పులిమామిడి రాజు

Next Story