రైజింగ్ ఆ నలుగురు మంత్రులలో మాత్రమే కనిపిస్తోంది..కాంగ్రెస్‌పై ఏలేటి సెటైర్లు

తెలంగాణ ఎందుకు వచ్చింది అంటే.. అప్పుల కుప్పగా చేసుకోవడానికా అని అనిపిస్తుందని.. బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik
Published on : 21 March 2025 2:38 PM IST

Telangana, Assembly Budget Sessions, Bjp Maheshwarreddy, Congress, CM Revanth

రైజింగ్ ఆ నలుగురు మంత్రులలో మాత్రమే కనిపిస్తోంది..కాంగ్రెస్‌పై ఏలేటి సెటైర్లు

తెలంగాణ ఎందుకు వచ్చింది అంటే.. అప్పుల కుప్పగా చేసుకోవడానికా అని అనిపిస్తుందని.. బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంబ తప్పులు చేసి, గొప్పలకు పోయింది. ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ఇన్ని హామీలు అమలు చేస్తారు అంటే? అనేక కుంభకోణాలు చేశారు. కక్కించి హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు ఒక్క కేసును కూడా విచారణ పూర్తి చేయలేదు. ఎన్ని అప్పులు ఎంత వడ్డీకి తెచ్చారు అనేది బడ్జెట్‌లో చెప్పలేదు. రెవెన్యూ వ్యయం, మూల ధన వ్యయం సమపాళ్లలో ఉంటేనే సమతుల్యం అయినట్లు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను అప్పుల కుప్ప చేసింది. మేం కూడా అలానే చేస్తాం అన్నట్లు కాంగ్రెస్ తీరు ఉంది..ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోన్న రైజింగ్ అంటే కేవలం ఆ నలుగురు మంత్రులలో మాత్రమే కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి రూ.8.6 లక్షల కోట్లు అప్పు ఉంది. అంటే రాష్ట్రంలో ఒక్కొక్కరి మీద రూ.2.22 లక్షల అప్పు ఉంది. కేంద్రం నిధులు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని దూషిస్తుంది. కాంగ్రెస్ హస్తం అంటే శూన్య హస్తం, భస్మాసుర హస్తంగా మారింది. అభయహస్తం హామీలను చట్టబద్ధత చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు కల్పించలేదు. మార్పు అంటే హామీలు పక్కన పెట్టి అప్పులు చేయడమేనా? అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

Next Story