గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ సృష్టిస్తున్న కలకలం ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే. ఒకదశలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల కొళ్ల పరిశ్రమ వారు ఎంతో నష్టపోయారు. చికెన్ ధర రూ.50 కి పడిపోయిందంటే పరిస్థితి అర్థం అవుతుంది. బర్డ్ ఫ్లూతో ఎఫెక్ట్ కేరళ రాష్ట్రం, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ,హర్యానా, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలు ప్రభావితం అయ్యాయి.
తాజాగా ఓకే ఊరిలో వందల సంఖ్యలో కోళ్లు, కాకులు, పిట్టలు మృత్యువాత పడడం ఆ గ్రామ వాసులు అందర్నీ టెన్షన్ పెడుతోంది. ధారూర్ మండలం దోర్నాల్ గ్రామంలో నిన్నటి నుంచి వందల సంఖ్యలో ఇలా కోళ్లు, కాకులు, పిట్టలు వరుసగా మృత్యువాత పడుతున్నాయని అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నాయి.
అసలే కరోనా వైరస్, కరోనా కొత్త స్ట్రెయిన్ లతో భయపడుతున్న తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు బర్డ్ ఫ్లూ భయం కూడా కాస్త ఆందోళన కలిగిస్తుంది. ఇక గ్రామంలో వరుసగా పక్షులు చనిపోవడంతో స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అధికారులు అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. కొన్ని శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపినట్లు సమాచారం అందుతోంది.