లహరి కేసులో ట్విస్ట్.. 'మా అల్లుడు బంగారం' అంటున్న మృతురాలి తండ్రి

నల్గొండ జిల్లాకు ఓ రాజకీయ నాయకుడి కోడలి మృతి కేసులో బిగ్‌ ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే లహరి భర్త వల్లభ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

By అంజి  Published on  30 July 2023 12:45 PM IST
Lahari death case, Vallabh Reddy, Crime news, Hyderabad

లహరి కేసులో ట్విస్ట్.. 'మా అల్లుడు బంగారం' అంటున్న మృతురాలి తండ్రి

నల్గొండ జిల్లాకు ఓ రాజకీయ నాయకుడి కోడలి మృతి కేసులో బిగ్‌ ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే లహరి భర్త వల్లభ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో రాజకీయ కుట్ర ఉందని మృతురాలి తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. నుదిటి మీద గాయం కనపడుతున్నా, పోస్టుమార్టం రిపోర్టులో వల్లభ్‌ రెడ్డి కొట్టడంతోనే చనిపోయిందని తేలినా.. ఫిట్స్ రావడంతోనే తమ అమ్మాయి చనిపోయిందని మృతురాలి తండ్రి జైపాల్‌ రెడ్డి చెబుతున్నాడు. తన అల్లుడు బంగారం అని బుకాయిస్తున్నాడు. వల్లభరెడ్డి పై తమకు ఎలాంటి అనుమానాలు లేవని చెప్పాడు.

లహరి మరణం పై వస్తున్న కథనాలు పూర్తిగా తప్పు అని, తమ అమ్మాయికి ఫిట్స్ రావడంతో గాయాలయ్యాయని చెప్పాడు. పోలీసులు కావాలని తప్పు దోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తమ వల్లే వల్లభ్ రెడ్డి కుటుంబానికి చెడ్డ పేరు వస్తోందని, మా అమ్మాయిని మంచి కుటుంబంలో ఇచ్చాము. వాళ్ళు మా అమ్మాయిని బాగా చూసుకున్నారని మృతురాలి తండ్రి జైపాల్‌ రెడ్డి పేర్కొన్నాడు. నల్గొండ జిల్లా నిడమానూను మండలం తుమ్మడము గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత, యడవెల్లి రంగశాయి రెడ్డి తనయుడు వల్లభ్ రెడ్డికి హైకోర్టు ఉద్యోగి కోతి జైపాల్‌రెడ్డి కుమార్తె అయిన లహరితో సంవత్సరం కిందట పెళ్లి జరిగింది. వల్లభ్ రెడ్డి, లహరి హైదరాబాద్‌లో నివాసం ఉండేవారు. అయితే 2 వారాల కిందట లహరికి హర్ట్ అటాక్ వచ్చిందని వల్లభ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అయితే లహరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆమె తండ్రి జైపాల్ రెడ్డికి వల్లభ్ చెప్పాడు. దీంతో జైపాల్‌ రెడ్డి దంపతులు వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. అయితే మొదట సహజ మరణంగానే భావించినప్పటికీ.. ఈ ఘటనలో పలు అనుమానాలు తలెత్తాయి. పోలీసులు 174 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లహరి పోస్టుమార్టమ్‌ రిపోర్ట్‌లో.. తలకు బలమైన గాయం కావడం వల్లే చనిపోయందని తేలింది. శరీరంలో శరీరంలో మల్టీ ఆర్గాన్స్‌కి కూడా గాయాలైనట్టుగా కూడా పోస్టుమార్టమ్ నివేదికలో తేలింది. వల్లభ్ రెడ్డి తీరును అనుమానించిన పోలీసులు.. అతడిని రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లా నుంచి నారాయణగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 201, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story