జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్..!

Big Shock To Congress. జీహెచ్ఎంసీ ఎన్నికల నేఫ‌థ్యంలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగలనుంది.

By Medi Samrat  Published on  20 Nov 2020 2:07 PM GMT
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్..!

జీహెచ్ఎంసీ ఎన్నికల నేఫ‌థ్యంలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగలనుంది. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్య నారాయణ పార్టీని వీడ‌నున్న‌ట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్.. మహేంద్రహిల్స్‌లోని సర్వే సత్య నారాయణ ఇంటికి వెళ్లారు. బీజేపీలో చేరాలని సర్వే సత్యనారాయణను బండి సంజయ్ ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే.. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి కూడా కమలం గూటికి చేరుతార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. గ్రేటర్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆమె ఢిల్లీ వెళ్లి బీజేపీ ఆగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు స‌మాచారం. విజయశాంతి ఇంటికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లి చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

ఇదిలావుంటే.. మరో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని కూడా బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి భూపేందర్‌ యాదవ్ కలిసినట్లు తెలుస్తోంది. విశ్వేశ్వర్‌రెడ్డిని కూడా బీజేపీలోకి ఆహ్వానించినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.
Next Story
Share it