బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్‌కు సుప్రీంలో బిగ్ షాక్

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది.

By -  Knakam Karthik
Published on : 16 Oct 2025 1:25 PM IST

Telangana, Supreme Court, Congress Government, BC Reservations

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్‌కు సుప్రీంలో బిగ్ షాక్

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరో వైపు హైకోర్టులో రిజర్వేషన్ల పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.

కాగా తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. కేసు హైకోర్టులో పెండింగ్ ఉంది.. బీసీ బిల్లుకు అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయని సింఘ్వీ కోర్టుకు వివరించారు. అయితే ప్రతివాద న్యాయవాది స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లమని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొందని.. బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే సుప్రీం తీర్పులు స్పష్టంగా ఉన్నాయని.. కృష్ణమూర్తి జడ్జిమెంట్ ఈ విషయాన్ని స్పష్టం చేసిందని తమ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు పేర్కొన్నట్లుగా పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. హైకోర్టులో తదుపరి విచారణ ఉన్నందునా వివాదాన్ని అక్కడే తేల్చుకోవాలని పేర్కొంది.

Next Story