ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, గడ్డం వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామ చేశారు. వివేక్ ఇవాళ తన కుమారుడు వంశీతో కలిసి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. చెన్నూరు అసెంబ్లీ టికెట్ ను వివేక్ కొడుకు వంశీకి కేటాయించాలని కాంగ్రెస్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. కాసేపట్లో శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో రాహుల్‌ను కలవనున్నారు. ఇటీవల వివేక్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సమావేశం అయిన విషయం తెలిసిందే. అంతకుముందు మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు.
బీజేపీ నుంచి సొంతగూటిలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్ ఎన్నికల టైంలో పార్టీ మారడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముందు నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నా వివేక్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక భారత రాష్ట్ర సమతిలో చేరారు. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి మారారు. ఇక ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివేక్ తిరిగి సొంత గూటికి రావడం ఏ మేరకు కలిసి వస్తుందో అని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.