తెలంగాణ వాహనదారులకు భారీ గుడ్‌న్యూస్..రెండో వాహనంపై అదనపు టాక్స్ రద్దు

తెలంగాణ వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనం కలిగించింది.

By -  Knakam Karthik
Published on : 21 March 2026 5:47 PM IST

Telangana, Transport Department, Vehicle Tax, Ponnam Prabhakar, Tax Relief, Vahan Portal

తెలంగాణ వాహనదారులకు భారీ గుడ్‌న్యూస్..రెండో వాహనంపై అదనపు టాక్స్ రద్దు

హైదరాబాద్: గత కొంతకాలంగా అదనపు పన్ను భారంతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనం కలిగించింది. ఒకే వ్యక్తి పేరు మీద ఒకటి కంటే ఎక్కువ వాహనాలు ఉన్నప్పుడు విధించే అదనపు 2 శాతం జీవితకాల పన్నును రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది వాహనదారులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించనుంది.

ఏమిటీ మార్పు?

ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి పేరు మీద ఇప్పటికే ఒక వాహనం ఉండి, రెండో వాహనాన్ని (కారు లేదా ద్విచక్ర వాహనం) కొనుగోలు చేస్తే, సాధారణ లైఫ్ ట్యాక్స్‌తో పాటు అదనంగా 2 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. అయితే, తాజా నిర్ణయంతో ఇకపై ఎన్ని వాహనాలు కొనుగోలు చేసినా కేవలం సాధారణ లైఫ్ ట్యాక్స్ కడితే సరిపోతుంది.

మార్చి 23 నుంచి అమల్లోకి..

ఈ కొత్త వెసులుబాటు ఈ నెల 23వ తేదీ (సోమవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానుంది. అదే రోజున రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 'వాహన్ పోర్టల్'ను కూడా ప్రారంభించనున్నారు. ఈ డిజిటల్ పోర్టల్ అందుబాటులోకి రావడంతో పన్ను చెల్లింపులు, వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా మరియు వేగంగా సాగనుంది.

Next Story