రేషన్‌కార్డులు ఉన్న వారికి బిగ్‌ అలర్ట్‌

రేషన్‌ కార్డుల ఈ - కేవైసీ ప్రక్రియ జనవరి 31లోపు ముగియనుంది. రేషన్‌ కార్డు / ఆహార భద్రత కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.

By అంజి  Published on  16 Jan 2024 7:04 AM IST
ration card holders, e kyc, Telangana

రేషన్‌కార్డులు ఉన్న వారికి బిగ్‌ అలర్ట్‌

రేషన్‌ కార్డుల ఈ - కేవైసీ ప్రక్రియ జనవరి 31లోపు ముగియనుంది. రేషన్‌ కార్డు / ఆహార భద్రత కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. దగ్గర్లో ఉన్న రేషన్‌ డీలర్‌ వద్ద ఉండే ఈ పాస్‌ మెషీన్‌ ద్వారా మాత్రమే ఇది చేయాలి. రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డులను తొలగించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఈ-కేవైసీని ప్రారంభించిన విషయం తెలిసిందే. కార్డులో ఎంతమంది పేర్లుంటే అంత మంది సమీప రేషన్ దుకాణాలకు వెళ్లి వేలిముద్రులు ఇవ్వాలి.

అయితే ఆధార్‌ అప్‌డేషన్‌ ప్రక్రియ పూర్తవకపోవడంతో ఈ - కేవైసీ చేసుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్‌ కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. రేషన్ కార్డు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయితే అసలైన లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారు అనే విషయంపై ప్రభుత్వానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనంతరం కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. తెలంగాణ ప్రజలు హామీ పథకాల ప్రయోజనాలను పొందేందుకు వారి రేషన్ కార్డ్ కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

Next Story