బక్రీద్‌ పోస్ట్‌ వివాదాస్పదం.. గొర్రె స్థానంలో గోవు.. క్షమాపణలు చెప్పిన భువనగిరి ఎమ్మెల్యే

భువనగిరి ఎమ్మెల్యే అయిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి.. బక్రీద్ సందర్భంగా ఓ పోస్టర్ రూపొందించి శుభాకాంక్షలు తెలిపారు.

By అంజి  Published on  18 Jun 2024 5:30 AM GMT
MLA Anil Kumar Reddy, Bakrid post controversy, Congress, Telangana

బక్రీద్‌ పోస్ట్‌ వివాదాస్పదం.. గొర్రె స్థానంలో గోవు.. క్షమాపణలు చెప్పిన భువనగిరి ఎమ్మెల్యే 

హైదరాబాద్: తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే సోమవారం సోషల్ మీడియాలో బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన పోస్ట్‌లో ఆవు గ్రాఫిక్ చిత్రాన్ని చేర్చడంతో వివాదంలో చిక్కుకున్నారు. దీనికి బిజెపి నుండి తీవ్ర స్పందన వచ్చింది.

కాంగ్రెస్ శాసనసభ్యుడు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి.. "అనుకోకుండా జరిగిన తప్పిదానికి" క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత సంబంధిత అన్ని సోషల్ మీడియా ఖాతాల నుండి పోస్ట్ తొలగించబడింది. పోస్టర్‌లో గొర్రె బొమ్మ ఉండాల్సి ఉందని, ఇప్పుడు దానిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించామని ఆయన తెలిపారు.

బక్రీద్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పడంలో అభ్యంతరకరం ఏమీ లేదు, అయితే ఎమ్మెల్యే ఏ సందేశం చెప్పాలనుకుంటున్నారు, బలమైన హిందుత్వ అభిప్రాయాలకు ప్రసిద్ధి చెందిన రాజా సింగ్ ప్రశ్నించారు. ''ఇవాళ బక్రీద్. కానీ, గోరక్షకులకు ఇది విషాద దినం. దేశమంతా మేము బాధలో ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే బక్రీద్ శుభాకాంక్షలు అని ఓ పోస్టు పెట్టారు. శుభాకాంక్షలు చెబితే ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, ఆ పోస్టులో ఒక ఆవును ప్రతిబింబిస్తూ డిజైన్ చేశారు. ఆ ఆవుపై దర్గా బొమ్మను రూపొందించారు. గోవును ఆ పోస్టులో చేర్చి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు'' అని రాజాసింగ్‌ అన్నారు.

ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

అనంతరం వీడియో విడుదల చేసిన అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను రామభక్తుడినని, తాను ఎప్పుడూ సంప్రదాయాలను పాటిస్తానని అన్నారు. లోపాన్ని గుర్తించిన వెంటనే పోస్టర్‌ను తొలగించినట్లు తెలిపారు. "ఎవరికైనా బాధ కలిగితే దానికి క్షమాపణలు చెబుతున్నాము. ఎందుకంటే, నేను రామభక్తుడిని" అని ఆయన అన్నారు. పోస్ట్ చేసే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తన సోషల్ మీడియా బృందాన్ని కోరానని, ఆ పోస్టర్‌ను ఎవరు పోస్ట్ చేశారో (అతని కోసం) కూడా తెలుసుకుంటానని అనిల్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు.

Next Story