అడవిలో కరెంట్‌ షాక్‌.. గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ మృతి

భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నస్తూరిపల్లి అటవీ ప్రాంతంలో విద్యుత్‌ షాక్‌తో గ్రేహౌండ్స్‌ కమాండో (కానిస్టేబుల్‌) ప్రవీణ్‌ మరణించారు.

By అంజి  Published on  12 Feb 2024 9:42 AM IST
Bhupalpally,  Greyhounds Commando, electric shock, Crime

అడవిలో కరెంట్‌ షాక్‌.. గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ మృతి

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నస్తూరిపల్లి అటవీ ప్రాంతంలో విద్యుత్‌ షాక్‌తో తెలంగాణ పోలీసు శాఖకు చెందిన గ్రేహౌండ్స్‌ కమాండో (కానిస్టేబుల్‌) ప్రవీణ్‌ మరణించారు. అడవి జంతువుల కోసం పెట్టిన విద్యుత్‌ తీగలు తగిలి మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తలు సంచరిస్తున్నారనే సమాచారంతో రావడంతో గాలించేందుకు టీమ్‌ అక్కడికి చేరుకుంది.

ఈ క్రమంలోనే కూంబింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జంతువులను వేటాడేందుకు ఇనుపకంచకు దుండగులు కరెంట్‌ పెట్టారు. ఈ విషయం తెలియక ఇనుపకంచెను పట్టుకుని కానిస్టేబుల్‌ మృతి చెందాడు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి.. కరెంట్‌ తీగలు పెట్టిన వారిని పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. కానిస్టేబుల్‌ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Next Story