ముంపు గ్రామాల సందర్శనకు బయలుదేరుతున్న భట్టి

Bhatti Vikramarka visit to flooded villages. సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యుడు మల్లు భట్టి విక్రమార్క నేడు భద్రాచలంలో

By Medi Samrat  Published on  15 July 2022 9:00 AM GMT
ముంపు గ్రామాల సందర్శనకు బయలుదేరుతున్న భట్టి

సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యుడు మల్లు భట్టి విక్రమార్క నేడు భద్రాచలంలో గోదావరి వరద ముంపు ప్రాంతాల సంద‌ర్శ‌న‌కు బయలుదేరనున్నారు. గోదావరి వరద జలాలతో నిండిపోయిన భద్రాద్రి రామాలయం, పరిసర ప్రాంతాలు, కరకట్ట మీదుగా గోదావరి బ్రిడ్జి, కూనవరం రోడ్డు, భద్రాచలం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు, భద్రాచలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో మూసివేసిన రోడ్లు, వరద తీవ్రతను పరిశీలించ‌నున్నారు.

భద్రాచలంలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పునరావసకేంద్రాన్ని సందర్శించి.. వరద బాధితులను పరామర్శిస్తారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యల గురించి ఆరా తీయ‌నున్నారు. వ‌ర‌ద బాధితుల సమస్యలు తెలుసుకొని, ప్రభుత్వ ఉన్నత అధికారులకు వారి సమస్యలను వివరించనున్నారు. అదేవిధంగా అకాల వర్షాలతో అతలాకుతలమైన అన్నదాతల పంట పొలాలను కూడా పరిశీలిస్తారు.

Next Story
Share it