వెంట్రామిరెడ్డిపై సీబీఐతో పాటు అనేక కేసులు ఉన్నాయని.. వెంట్రామిరెడ్డి రాజీనామా ఒక్క రోజులోనే ఆమోదించడం జుగుప్సాకరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వెంట్రామిరెడ్డి కలెక్టర్‌గా రాజీనామా వెంటనే టీఆర్ఎస్ లో జాయిన్ అవ్వడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అప్పట్లోనే సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి పరువు తీసాడని.. ఒక అధికారిగా పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ కి పనిచేశాడని విమర్శించారు. వెంట్రామిరెడ్డి కేసులపై క్లియరెన్స్ ఇవ్వకుండా రాజీనామా ఎలా చేస్తారు, ఎలా ఆమోదిస్తారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంట్రామిరెడ్డి నామినేషన్ వేసిన విధానం కూడా పద్ధతి ప్రకారం లేదని.. అప్లికేషన్ కూడా కరెక్ట్ గా లేదని.. అతనిపై, అతని అవినీతిపై చర్యలు తీసుకొని.. నామినేషన్ రిజెక్ట్ చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.