జైలు నుండి భానుకిరణ్‌ విడుదల

2005లో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర హత్యకేసులో నిందితుడు మద్దెలచెరువు సూరి హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మలిశెట్టి భాను కిరణ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది

By Medi Samrat  Published on  6 Nov 2024 4:12 PM IST
జైలు నుండి భానుకిరణ్‌ విడుదల

2005లో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర హత్యకేసులో నిందితుడు మద్దెలచెరువు సూరి హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మలిశెట్టి భాను కిరణ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2011లో కిరణ్‌ను సీఐడీ అరెస్టు చేసింది. సూరి కేసులో 2011లో భానుకి 14 ఏళ్ల జీవిత ఖైదు పడింది. చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో 12 ఏళ్లపాటు శిక్షను అనుభవించాడు.

భాను కిరణ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈరోజు మధ్యాహ్నం సమయంలో జైలు నుండి విడుదలయ్యారు. 12 సంవత్సరాల క్రితం మద్దెల చెరువు సూరిని భాను కిరణ్ అతి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని పట్టుకోవడమే కాకుండా హత్యకు సంబంధించిన సాక్ష్యాలను కూడా నాంపల్లి కోర్టులో సమర్పించగా.. భాను కిరణ్ కు జైలు శిక్ష విధించింది. జైలు నుండి విడుదలైన భాను కిరణ్ ఇన్నోవా వాహనంలో వెళ్లిపోయారు. మీడియా ఆయన్ను సంప్రదించాలని ప్రయత్నించగా ఆయన నుండి ఎలాంటి స్పందన లేదు.

Next Story