భద్రాచలం వెళ్లాలని అనుకుంటున్నారా.. మీకిదే గుడ్ న్యూస్

భద్రాచలం జిల్లాలో ఉన్న శ్రీ సీతా రామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి, మహా పట్టాభిషేక ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు గుడ్ న్యూస్.

By Medi Samrat  Published on  11 April 2024 9:00 PM IST
భద్రాచలం వెళ్లాలని అనుకుంటున్నారా.. మీకిదే గుడ్ న్యూస్

భద్రాచలం జిల్లాలో ఉన్న శ్రీ సీతా రామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి, మహా పట్టాభిషేక ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు గుడ్ న్యూస్. ఇకపై భక్తులు ఆన్‌లైన్‌లో గదులను రిజర్వ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 17, 18 తేదీలలో భక్తుల రద్దీకి అనుగుణంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆన్ లైన్ లో రూమ్స్ బుకింగ్ ను ప్రవేశపెట్టారు. ఆలయ వెబ్‌సైట్ ద్వారా గదులను బుక్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్న భక్తులు వెబ్‌సైట్‌ను సందర్శించండి.

భద్రాచలంలో తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు మంగళవారం ఉగాది సందర్భంగా ఉదయం మేళతాళాలు, మంగళ వాయుద్యాలు, వేదమంత్రాల నడుమ గౌతమి నది నుండి తీర్థ జలం తీసుకుని వచ్చి శ్రీస్వామి వారికి ప్రత్యేక తిరుమంజనం నిర్వహించారు.

Next Story