రూ. 2 కోట్ల విలువైన గంజాయి ప‌ట్టివేత‌

Bhadrachalam Police Seized Ganja. భద్రాచలంలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. సుమారు రెండు కోట్లు విలువ చేసే

By Medi Samrat  Published on  21 July 2021 9:57 AM GMT
రూ. 2 కోట్ల విలువైన గంజాయి ప‌ట్టివేత‌

భద్రాచలంలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. సుమారు రెండు కోట్లు విలువ చేసే గంజాయి పట్టుబడటం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ భద్రాచలంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భద్రాచలం పట్టణ సీఐ స్వామి ఆధ్వర్యంలో.. ఎస్సై మధు ప్రసాద్ సిబ్బందితో భద్రాచలం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో అటుగా వ‌చ్చిన‌ లారీ (నెంబ‌ర్‌ RJ17 GA3077) అనుమానాస్పదంగా కన్పించడంతో.. పోలీసులు లారీ డ్రైవర్, క్లీనర్ లను విచారించి.. తనిఖీ చేయగా ప్రభుత్వ నిషేదిత గంజాయి ఉండటాన్ని గమనించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో లారీ లో 1,005 కేజీల గంజాయి లభించిందని.. దీని విలువ సుమారు రెండు కోట్ల‌ రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ప‌ట్టుబ‌డిన ఇరువురు మధ్య ప్రదేశ్ కు చెందినవారని ఎస్పీ తెలిపారు. గంజాయిని సీలేరు నుండి మధ్యప్రదేశ్ కు త‌ర‌లిస్తున్నార‌ని ఎస్పీ పేర్కొన్నారు. వసీం అనే వ్యక్తి దగ్గర గంజాయిని కొని.. మధ్యప్రదేశ్ లోని కొనుగోలుదారుల వద్దకు గంజాయిని చేరవేస్తున్నామని నిందితులు తెలిపినట్లు ఎస్పీ వెల్లడించారు.


Next Story
Share it