బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం అంటే ప్రాణత్యాగం చేయడమే : ఎమ్మెల్యే తెల్లం

మ‌ళ్లీ బీఆర్ఎస్‌లోకే వెళ్తున్నార‌న్న వ్యాఖ్య‌ల‌పై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు స్పందించారు.

By Medi Samrat  Published on  31 July 2024 2:36 PM GMT
బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం అంటే ప్రాణత్యాగం చేయడమే : ఎమ్మెల్యే తెల్లం

మ‌ళ్లీ బీఆర్ఎస్‌లోకే వెళ్తున్నార‌న్న వ్యాఖ్య‌ల‌పై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు స్పందించారు. నిన్నటి నుండి నేను పార్టీ మారుతున్నానని వస్తున్నటువంటి వార్తలు అవాస్తవమ‌ని ఖండించారు. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం అంటే ప్రాణత్యాగం చేయడమేన‌న్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే భద్రాచలం అభివృద్ధి చెందుతుందని.. భద్రాచలం అభివృద్ధి కొరకే BRS ను వీడి కాంగ్రెస్ లోకి రావటం జరిగిందని వివ‌ర‌ణ ఇచ్చారు.

భద్రాచలం పట్టణ ప్రజలందరూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని తెల్లం వెంకటరావు కోరారు. నా గురువు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆశీస్సులు, దీవెనలతో భద్రాచలం అభివృద్ధి చెందుతుందన్న‌ ఒకే ఒక్క నమ్మకంతో భద్రాచలం అభివృద్ధి కొరకే పార్టీ మారడం జరిగింది. అదే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా తప్పితే పార్టీ మారడం జరగదని ఎమ్మెల్యే వెంకట్రావు క్లారిటీ ఇచ్చారు.

Next Story