భద్రాచల శ్రీరాముడికి అరుదైన కానుక అందించారు ఓ దాత. రామయ్యకు బంగారు పాదాలు, సీతమ్మకు స్వర్ణ కవచంతో కూడిన బంగారు చీర బహూకరించారు. భద్రాచలం దేవస్థానంకు చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా.. సుమారు 13.50 కిలోల బంగారంతో ఈ కానుకలు చేయించారు ఆ దాతలు.
బెంగళూరుకు చెందిన జేవీ రంగరాజు దంపతులు ఈ కానుకలు తయారు చేయించి ఇచ్చారు. ప్రముఖ స్థపతి కోదండపాణి రామయ్య ఈ స్వర్ణ భద్రకవచాలను తయారు చేయడం విశేషం. ఇక నుంచీ భద్రాద్రిలో ప్రతి శుక్రవారం రామయ్య స్వర్ణ కవచాలతో బంగారు రామయ్యగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. భద్రాద్రి దేవస్థానం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఇంత భారీస్థాయిలో కానుకలు అందడం ఇదే ప్రథమం. దీంతో ఈ కానున ఆలయ చరిత్రలో నిలిచిపోతుందని పూజారులు తెలిపారు.