తెలంగాణలో మందుబాబులకు షాక్‌.. బీర్ల ధరలు భారీగా పెంపు

తెలంగాణలో మందుబాబులకు షాక్‌ తగిలింది. బీర్ల ధరలను ప్రస్తుతం ఉన్న ధరపై 15 శాతం పెంచుతూ ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

By అంజి
Published on : 11 Feb 2025 6:34 AM IST

Beer prices, Telangana, Hyderabad

తెలంగాణలో మందుబాబులకు షాక్‌.. బీర్ల ధరలు భారీగా పెంపు

తెలంగాణలో మందుబాబులకు షాక్‌ తగిలింది. బీర్ల ధరలను ప్రస్తుతం ఉన్న ధరపై 15 శాతం పెంచుతూ ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.

ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ SAM రిజ్వీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధరల స్థిరీకరణ కమిటీ సిఫార్సుల మేరకు బీరు ధరలను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం.. ఐఎంఎఫ్‌ఎల్‌ డిపోల వద్ద ఉన్న నిల్వలు, రవాణాలో ఉన్నవి కూడా, మంగళవారం నుండి సవరించిన ఎంఆర్‌పీ వద్ద విక్రయించబడతాయి.

కింగ్‌ఫిషర్ బీర్ ధరలను 33.1 శాతం పెంచాలని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందని, రాష్ట్రంలో సరఫరాలను తగ్గిస్తామని కూడా చెప్పిన సంగతి తెలిసిందే. గత నెలలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల ఒత్తిడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే, బీరు ధరలను 15 శాతం పెంచారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మద్యం ధరలను పెంచింది. రూ.99 మద్యం, బీర్ల ధరలు తప్ప మిగతా మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది.

Next Story