ఎంతో అరుదైన మాటను విన్న మందు బాబులు

Beer Prices Down in Telangana. ఎప్పుడు చూసినా మద్యం ధరలు పెంచారు.. బీర్ పై ఇంత పెంచారు.. ఫుల్ బాటిల్ పై ఇంత పెంచారు

By Medi Samrat  Published on  5 July 2021 8:55 PM IST
ఎంతో అరుదైన మాటను విన్న మందు బాబులు

ఎప్పుడు చూసినా మద్యం ధరలు పెంచారు.. బీర్ పై ఇంత పెంచారు.. ఫుల్ బాటిల్ పై ఇంత పెంచారు అనే వార్తలే ఎక్కువగా మందు బాబులు వినే వారు. అయితే మద్యం ధరలు తగ్గాయి అనే వార్తలను చాలా తక్కువగా వింటూ ఉంటారు మందు బాబులు. అలాంటి వార్తే ఇప్పుడు మందు బాబుల కోసం తెలంగాణ ఆబ్కారీ శాఖ చెప్పింది. తెలంగాణ ఆబ్కారీ శాఖ బీరు ధరపై 10 రూపాయలు తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఈ తగ్గింపు అన్ని బ్రాండ్ల బీర్లకు వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

ఇప్పటిదాకా ఎక్సైజ్ సుంకం పేరిట సీసా ఒక్కింటికి రూ.30 అదనంగా వసూలు చేశారు. ఇప్పుడా ప్రత్యేక సెస్ నుంచి రూ.10 తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. తగ్గింపు నేటి నుంచే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఆబ్కారీ శాఖ వెల్లడించింది. సాధారణంగా బీర్లకు వేసవిలో అత్యధిక డిమాండ్ ఉంటుంది. ఎండలు తగ్గడంతో బీర్లకు కూడా డిమాండ్ తగ్గుతుంది. ఈ నేపథ్యంలోనే బీర్ల ధరలు తగ్గించి ఉంటారని అంటున్నారు. తెలంగాణ ఖజానాకు భారీగా ఆదాయం మద్యం నుండే వస్తున్న సంగతి తెలిసిందే..! ఇప్పుడు తగ్గించిన బీరు ధరలు ఎంత ఇంపాక్ట్ చూపుతాయో కాలమే నిర్ణయిస్తుంది.


Next Story