Hyderabad: రాహుల్‌ గాంధీకి వ్యతిరేకంగా బ్యానర్లు

రాహుల్‌ గాంధీకి వ్యతిరేకంగా ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో బ్యానర్లు వెలిశాయి. తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలితీసుకున్న కాంగ్రెస్‌ నాయకులకు స్వాగతమంటూ వాటిలో పేర్కొన్నారు.

By అంజి  Published on  17 Nov 2023 10:55 AM IST
Banners, Rahul Gandhi , Shamshabad, Telangana Polls

Hyderabad: రాహుల్‌ గాంధీకి వ్యతిరేకంగా బ్యానర్లు

త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ జోరుగా ప్రచారం చేస్తోంది. ఇవాళ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. అనంతరం సాయంత్రం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి జయపుర వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే రాహుల్‌ గాంధీకి వ్యతిరేకంగా ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో పోస్టర్లు, బ్యానర్లను ఏర్పాటు చేశారు గుర్తుత తెలియని వ్యక్తులు. 'తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలి తీసుకున్న కాంగ్రెస్‌ నాయకులకు స్వాగతం' అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. పోస్టర్లలో రాహుల్‌ గాంధీతో పాటు తెలంగాణ అమరులు శ్రీకాంతచారి, వేణుగోపాల్‌రెడ్డి, కానిస్టేబుల్‌ కిష్టయ్య, యాదయ్య పలువురు ఫొటోలను ఉంచారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జరిగిన ప్రాణనష్టానికి కాంగ్రెస్ పార్టీ చింతిస్తున్నట్లు నవంబర్ 16 గురువారం నాడు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం అన్నారు. "ఆత్మహత్య అనేది దురదృష్టకర సంఘటన, ప్రజా ఉద్యమంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, దానికి చింతిస్తున్నాము, కానీ మీరు దానికి కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యులను చేయలేరు" అని తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. 2009లో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం 2009లో ప్రకటించి 2014 వరకు ఆలస్యం చేయడంతో తెలంగాణ ఆందోళన సందర్భంగా ఆత్మహత్యలకు కాంగ్రెస్‌ కారణమని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) నాయకులు ప్రశ్నించడంపై కాంగ్రెస్‌ నాయకుడు స్పందించారు.

Next Story