మరో రెండు రోజుల్లో పిబ్రవరి నెల ముగియనుంది. వచ్చే నెల మార్చిలో బ్యాంకు పనులు ఉన్నవారు సెలవు దినాలపై ఫోకస్ పెడుతుంటారు. పని దినాలలో బ్యాంకింగ్ సేవలు పూర్తి చేసుకునేందుకు చూస్తుంటారు. అయితే మార్చి నెలలో ఎనిమిది రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. మార్చి నెల సెలవుల జాబితాలో మహాశివరాత్రి, హోలీ, నాలుగు ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు ఉన్నాయి. దీని ప్రకారం ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక ప్రభుత్వ సెలవులు ఉంటాయి. బ్యాంకు సెలవుల ప్రకారం.. తమ బ్యాంకు సంబంధిత పనిని ప్లాన్ చేసుకోవాలని కస్టమర్‌లకు సూచించారు.
మార్చి- 2022 బ్యాంక్ సెలవులు
1. మార్చి 01 - మంగళవారం, మహాశివరాత్రి
2. మార్చి 06 - ఆదివారం
3. మార్చి 12 - రెండవ శనివారం
4. మార్చి 13 - ఆదివారం
5. మార్చి 18 – హోలీ
6. మార్చి 20 - ఆదివారం
7. మార్చి 26 - నాల్గవ శనివారం
8. మార్చి 27 - ఆదివారం
కేంద్ర ప్రభుత్వ సెలవులు అన్ని బ్యాంకులు, పబ్లిక్, ప్రైవేట్ రంగానికి వర్తిస్తాయని గుర్తుంచుకోండి. మార్చి నెల సెలవు తేదీలు ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకుకు మారుతూ ఉంటాయి. రాష్ట్రాల వారీగా కూడా బ్యాంకు సెలవులు ఉంటాయి. రాష్ట్రాల వారిగా సెలవుల విషయానికి వస్తే.. కస్టమర్లు తమ సంబంధిత బ్యాంకు శాఖలను సందర్శించి ఖచ్చితమైన తేదీలను తెలుసుకోవచ్చు. ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు మాత్రం బ్యాంకులు మూసివేయబడతాయి.