మారిన బ్యాంకు పనివేళలు.. కొత్త టైమింగ్స్ ఏమంటే..

Bank Timings Change In Telangana. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ సడలింపు వేళలు పొడిగించిన‌ నేపథ్యంలో రాష్ట్రస్థాయి

By Medi Samrat  Published on  31 May 2021 11:03 AM GMT
మారిన బ్యాంకు పనివేళలు.. కొత్త టైమింగ్స్ ఏమంటే..

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ సడలింపు వేళలు పొడిగించిన‌ నేపథ్యంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది. ఈ స‌మావేశంలో బ్యాంకుల పనివేళలు మార్పులు చేయాలంటూ పలువురు కమిటీ సభ్యులు సూచించారు. దీంతో పనివేళలలో మార్పులు చేశారు. ఇక‌పై ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ తెలిపింది. ఇప్పటి వరకు బ్యాంక్‌ పనివేళలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం సడలింపు సమయాన్ని పొడిగించడంతో బ్యాంకర్ల కమిటీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదిలావుంటే.. సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఆదివారం మ‌ధ్యాహ్నాం 2 గంట‌ల‌కు భేటీ అయిన‌ కేబినేట్ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. మరో 10 రోజులు తెలంగాణలో లాక్‌డౌన్‌ కొనసాగించాలని కేబినెట్ సమావేశం తీర్మానించింది. రోజువారీ సడలింపును ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించ‌డం జ‌రిగింది.





Next Story