గ్యాంగ్ రేప్ కేసును సీబీఐకి అప్ప‌గించాలి : సీఎంకు బీజేపీ చీఫ్ లేఖ‌

Bandi writes to CM KCR. హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి

By Medi Samrat  Published on  4 Jun 2022 3:19 PM IST
గ్యాంగ్ రేప్ కేసును సీబీఐకి అప్ప‌గించాలి : సీఎంకు బీజేపీ చీఫ్ లేఖ‌

హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి అప్పగించాలని బిజెపి చీఫ్ బండి సంజయ్ శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. లేఖ‌లో నిందితులందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ రేప్ కేసులో ఇప్పటి వరకు ఇద్దరు మైనర్లతో సహా ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. శుక్రవారం అరెస్టు చేసిన ఒక నిందితుడిని సాదుద్దీన్ మాలిక్‌గా గుర్తించారు. "నిందితుడు సాదుద్దీన్ మాలిక్ అరెస్టు కొనసాగింపుగా, చట్టంతో విభేదిస్తున్న ఇద్దరు పిల్లలను శనివారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి కస్టడీ కోసం జువైనల్ కోర్టులో హాజరు పరచడం జరిగింది" అని పోలీసులు తెలిపారు.

ఇదిలావుంటే.. మైనర్ గ్యాంగ్ రేప్ కేసుపై హైదరాబాద్ పోలీసులపై బీజేపీ నేత రఘునందన్ రావు అంతకుముందు రోజు విరుచుకుపడ్డారు. మైనర్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడి కుమారుడిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదిలావుంటే.. హైదరాబాద్‌లో అత్యాచారం కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. మే 28న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో పార్టీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై మైనర్ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.










Next Story