12 నుంచి బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర

Bandi Sanjay's fourth Phase of Praja Sangrama Yatra from 12. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఇప్పటివరకు మూడు విడతలు పూర్తయ్యాయి.

By Medi Samrat
Published on : 10 Sept 2022 8:00 PM IST

12 నుంచి బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర

రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఇప్పటివరకు మూడు విడతలు పూర్తయ్యాయి. బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 12న కుత్బుల్లాపూర్ రాంలీలా మైదానంలో ఉదయం 10 గంటలకు నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవ సభ జరగనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హాజరుకానున్నారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ విభాగం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

బండి సంజయ్ సంగ్రామ యాత్ర ఇన్చార్జి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన కుత్బుల్లాపూర్ నియోజక వర్గం చిత్తరమ్మ దేవాలయం నుండి బండి సంజయ్ నాలుగవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. ప్రారంభ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పాల్గొంటారని తెలిపారు. పది రోజులపాటు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో నాలుగవ విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ముగ్గురు పోలీస్ కమిషనర్లకు నాలుగో విడత యాత్ర రూట్ మ్యాప్ ఇచ్చి.. అనుమతులు కోరామన్నారు. ఇంతవరకు రాతపూర్వకంగా అనుమతులు ఇవ్వలేదన్నారు. పోలీసులు అనుమతి ఇచ్చినా.. ఇవ్వకున్నా యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.


Next Story