సాయి గ‌ణేష్ కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన బండి సంజ‌య్‌

Bandi Sanjay visiting Sai Ganesh family members. ఖమ్మంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ సాయి గణేష్ కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

By Medi Samrat
Published on : 15 May 2022 5:02 PM IST

సాయి గ‌ణేష్ కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన బండి సంజ‌య్‌

ఖమ్మంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ సాయి గణేష్ కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆదివారం ప‌రామర్శించారు. సాయి గణేష్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు బండి సంజయ్. ఆయ‌న వెంట‌ పొంగులేటి సుధాకర్ రెడ్డి, గరికపాటి మోహనరావు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. సాయి గణేష్ ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ గణేష్ అమ్మమ్మ సావిత్రమ్మ బోరున విల‌పించిం.

పోలీసుల‌ వేధింపులకు తన మనవడు బలయ్యారని సావిత్రమ్మ కంటతడిపెట్టారు. సాయి గణేష్ కు బీజేపీ అంటే ప్రాణమని, పార్టీ కోసం నిరంతరం కష్టపడే వారిని వివరించారు. సాయి గణేష్ పై 16 కేసులు పెట్టారని, రౌడీషీట్ పెట్టారని సావిత్రమ్మ వాపోయింది. మంత్రి, పోలీసులు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారని సావిత్రమ్మ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యింది. సావిత్రమ్మ‌ కుటుంబాన్ని బండి సంజ‌య్‌ ఓదార్చారు. సావిత్రమ్మకు ఇల్లు రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు బండి సంజయ్.

















Next Story