దేశంలో అతి పెద్ద అవినీతి ముఖ్యమంత్రి కేసీఆరే : బండి సంజ‌య్

Bandi Sanjay Sensational Comments On KCR. దళితుని ముఖ్యమంత్రి చేయకపోవటానికి కారణం సీఎం కేసీఆర్‌ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

By Medi Samrat  Published on  16 July 2021 12:37 PM GMT
దేశంలో అతి పెద్ద అవినీతి ముఖ్యమంత్రి కేసీఆరే : బండి సంజ‌య్

దళితుని ముఖ్యమంత్రి చేయకపోవటానికి కారణం సీఎం కేసీఆర్‌ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజ‌య్ డిమాండ్ చేశారు. వేములవాడలో జ‌రిగిన‌ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. దళితుని ముఖ్యమంత్రి చేయకపోవటానికి కారణమేంటో చెప్పాల‌ని.. దేశంలోఅతి పెద్ద అవినీతి ముఖ్యమంత్రి కేసీఆరే న‌ని అన్నారు. ఈ విషయంలో దళితులు, ఎస్సీ మోర్చా నాయకులు పోరాటం చేయాలని అన్నారు. ద‌ళిత ఉప ముఖ్యమంత్రిలను ఏందుకు తొలగించారని ప్ర‌శ్నించారు.

అంబేద్క‌ర్ రాజ్యాంగంలో ఆర్టికల్-3 పెట్టక పోతే చిన్నారాష్ట్రాలు ఎక్కడివని ప్ర‌శ్నించారు. ఆయన చలువతో కొత్త రాష్ట్రం ఏర్పడితే అధికారంలోకి వచ్చి కేసీఆర్‌ ఆయనను మరిచిపోయారని.. కనీసం ఆయనకు దండ వేయటానికి తీరికలేదని మండిప‌డ్డారు. దళితులకు మూడు ఎకరాలు ఇచ్చేందుకు భూమి లేదు కానీ.. అమ్మడానికి మాత్రం భూమి దొరుకుతుందని ఫైర్ అయ్యారు. తెలంగాణ తల్లీని రక్షించే బాధ్యతను బీజేపీ కార్యకర్తలు తీసుకోవాలని.. బీజేపీ వల్లనే ప్రజాస్వామ్య వ్యవస్థ తెలంగాణలో రక్షించ బడుతుందని అన్నారు.

కేవలం బీజేపీలో మాత్రమే ఎస్సీలు ఎక్కువగా ఉన్నారని.. దళితులకు అండగా ఉన్న పార్టీ బీజేపీన‌ని అన్నారు. ముఖ్యమంత్రికి పేదవారు అంటే కోపమ‌ని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం చేస్తున్న నాయకులపై పీడీ యాక్ట్‌ ఉపయోగించే పార్టీ టీఆర్ఎస్‌ పార్టీ అని అన్నారు. నకలైట్లు చంపుతామని బెదిరించినా కూడా బీజేపీ కార్యకర్తలు దైర్యంతో పనిచేశారని.. కొంత మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. పద్దెనిమిది శాతం ఉన్న ఎస్సీలు కలిసి ఉండాలి.. పోరాడాలని బండి సంజ‌య్ సూచించారు. దళితులు ఉద్యమిస్తే.. బీజేపీకి మద్దతు ఇస్తే అధికారం బీజేపీదేన‌ని అన్నారు. జనరల్ సీట్లలో కూడా ఎస్సీ లకు పార్టీ టికెట్లు ఇస్తామ‌ని.. పాదయాత్రలో ఎస్సీ మోర్చా కీలక పాత్ర పోషించాలని కోరారు.


Next Story
Share it