మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీలో చేరికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈటల రాజేందర్ వారం రోజుల్లో బీజేపీలో చేరతారని ఆయన అన్నారు. ఈటెల ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడానికి న్యాయపరమైన సలహా తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ఎలాంటి హామీ లేకుండానే ఈటల బీజేపీలో చేరుతున్నారని.. బీజేపీలో ఎవరు చేరినా.. ఎలాంటి హామీ ఉండదని సంజయ్ అన్నారు.
బీజేపీ సిద్ధాంతాలతో పాటు ప్రధాని మోదీ పాలన నచ్చే ఈటల బీజేపీలో చేరుతున్నారని సంజయ్ అన్నారు. ఇక సీఎం కేసీఆర్‌ను వ్యతిరేకించే వారికి బీజేపీ అండగా ఉండి పోరాటం చేస్తుందని.. తెలంగాణ ఉద్యమకారులకు బీజేపీ మంచి వేదిక అని భావిస్తున్నారని సంజయ్ అన్నారు.
సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని సంజయ్ అన్నారు. ఇతర పార్టీలు చేసే విమర్శలు తాము పాటించుకోమని.. టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వివరాలను పూర్తిగా సేకరించామన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ 18 మంది ముఖ్యనేతలపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నామని... మా ఉద్యమ పంథానే వేరుగా ఉంటుందని సంజయ్ అన్నారు. వారం రోజులుగా సీఎం కేసీఆర్ కేసుల పైనే ఆరా తీస్తున్నామని. ఈ స్కాంలు చూశాకే సీఎం కేసీఆర్ ఎంత పెద్ద అవినీతిపరుడో తేలిపోయిందని బండి సంజయ్ అన్నారు.