సంధ్య థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. పవన్ కళ్యాణ్‌కు సీఎం రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనిపించారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఆరు గ్యారంటీలను పక్కదారి పట్టించాలని చూస్తున్నారని అన్నారు. అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ చెడిందో.. పుష్ప-3 రిలీజ్‌కు ముందే.. అల్లు అర్జున్‌కి రేవంత్‌రెడ్డి సినిమా చూపించారు.. 14 శాతం కమీషన్ దగ్గర చెడిందేమోనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముగ్గురు మంత్రులు కమీషన్లు వసూలు చేస్తున్నారని.. సచివాలయం, మంత్రుల పేషీలు కమీషన్లకు అడ్డాగా మారాయని ఆరపించారు. ఇక్కడి కమీషన్లతో ఢిల్లీకి కప్పం కడుతున్నారన్నారు. మంత్రులందరికీ సీఎం కావాలని ఉందని.. ఢిల్లీకి డబ్బులు పంపడం వల్లే సీఎం పదవి నిలబడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.