28 నుండి బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర

Bandi Sanjay Praja Sangrama Yatra Starts From 28th Nov. ఈనెల 28 నుండి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర చేప‌ట్ట‌నున్నారు.

By Medi Samrat
Published on : 22 Nov 2022 6:45 PM IST

28 నుండి బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర

ఈనెల 28 నుండి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర చేప‌ట్ట‌నున్నారు. 28వ తేదీన బాసర అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి బైంసా నుండి పాదయాత్ర ప్రారంభించనున్నారు బండి సంజయ్. డిసెంబర్ 15 లేదా 16 వరకు కొనసాగనున్న 5వ విడత పాదయాత్ర కొన‌సాగ‌నుంది. కరీంనగర్ లో ముగింపు సభ ఉంటుంద‌ని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. 5వ విడత పాదయాత్ర వివరాలను ప్రజా సంగ్రామ యాత్ర సహ ప్రముఖ్ టి. వీరేందర్ గౌడ్ ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇప్పటి వరకు 4 విడతలు పాదయాత్ర చేసి 13 ఎంపీ, 48 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మొత్తం 21 జిల్లాల్లో 1178 కి.మీల మేర నడిచినట్లు వెల్లడించారు. పాదయాత్రతో అనేక మార్పులు సంభవించాయని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేననే సంకేతాలు వెలువడ్డాయని వీరేందర్ గౌడ్ పేర్కొన్నారు.


Next Story