బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ కామెంట్స్ పై మంత్రి కేటీఆర్ ఫైర్‌

Bandi Sanjay Fire on KTR .. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ చేస్తానని చేసిన కామెంట్స్ మీద మంత్రి

By సుభాష్  Published on  24 Nov 2020 6:43 PM IST
బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ కామెంట్స్ పై మంత్రి కేటీఆర్ ఫైర్‌

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ చేస్తానని చేసిన కామెంట్స్ మీద మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. 'హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ ఏంటి?! కొన్ని సీట్లు, ఓట్ల కోసం ఇంత దిగజారుతారా?. సహచర ఎంపీ విద్వేషపూరిత వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి సమర్థిస్తారా?' అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు ఖండించలేదని కేటీఆర్‌ నిలదీశారు. పచ్చని హైదరాబాద్‌లో చిచ్చుపెడతారా? హైదరాబాద్‌ ప్రజలను విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో గెలిచి హైదరాబాద్ మేయర్ పీఠాన్ని అధిరోహించిన వెంటనే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని.. అక్కడ ఉన్న రోహింగ్యాలు, పాకిస్థానీలను తరిమికొడతామని అన్నారు బండి సంజ‌య్‌. హిందువుల కోసం బీజేపీ పోరాడుతోందని.. పాకిస్థాన్ హైదరాబాద్ కావాలా? భారతదేశ హైదరాబాద్ కావాలా? నగర ప్రజలు తేల్చుకోవాలని చెప్పారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద తమ అడ్డా పెడతామని అన్నారు. ఓ వర్గం వారు వేసిన ఓట్ల వల్ల బీహార్ లో ఎంఐఎం గెలిచిందని మండిపడ్డారు. వాళ్ళు ఎక్కడా అధికారంలో లేదు. హామీలు ఇచ్చింది లేదు. గెలిచిన వారిలో ఒకడు ఈ దేశాన్ని హిందూస్తాన్ అని అంటున్నాడు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story