సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన బండి సంజ‌య్‌

Bandi Sanjay Fire On CM KCR. ఖబడ్దార్ కేసీఆర్.. బీఎల్ సంతోష్ జీపైనే కేసు పెడతావా? అంటూ సీఎం కేసీఆర్‌పై బీజేపీ అధ్య‌క్షుడు

By Medi Samrat  Published on  22 Nov 2022 8:45 PM IST
సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన బండి సంజ‌య్‌

ఖబడ్దార్ కేసీఆర్.. బీఎల్ సంతోష్ జీపైనే కేసు పెడతావా? అంటూ సీఎం కేసీఆర్‌పై బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ నిప్పులు చెరిగారు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. మీలెక్క ఆయ‌న‌కు ఆస్తిపాస్తులు, విదేశాల్లో పెట్టుబడులు లేవని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగర శివారులోని లియోనియా రిసార్ట్స్ లో ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ స‌మావేశాల‌కు హాజ‌రైన ఆయ‌న మాట్లాడుతూ.. బంధాలను త్యజించి దేశ హితమే లక్ష్యంగా సేవ చేస్తున్న ప్రచారక్ వ్యవస్థనే కించపరుస్తావా? అంటూ మండిప‌డ్డారు. నీ కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొడతాం.. నీ గడీల పాలనను బద్దలు కొడతాం అంటూ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

కేసీఆర్‌.. నీ పాలన బోర్డు తిప్పేసిన దివాళా తీసిన సంస్థ అని విమ‌ర్శించారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకొస్తే మరో 5 లక్షల కోట్ల అప్పు ఖాయం.. తెలంగాణ చేతికి చిప్ప తథ్యం అన్నారు. అభివృద్ధి చెందిన టాప్ 5 దేశాల సరసన భారత్ ను చేర్చిన ఘనత మోదీదే అని కొనియాడారు. ప్రధాని మోదీ ఏడాదిన్నరలో 10 లక్షలకుపైగా ఉద్యోగ నియామక పత్రాలిస్తున్నార‌ని.. 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా ఒక్క ఉద్యోగం భర్తీ చేయని పాలన కేసీఆర్ దని విమ‌ర్శించారు

కాంగ్రెస్ అంతమైన పార్టీ.. కమ్యూనిస్టులు సిద్ధాంతాన్ని సీఎం కాళ్ల దగ్గర పెట్టార‌ని.. అన్ని పార్టీలు ఏకమై బీజేపీని ఓడించాలనుకుంటున్నాయ్. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపు తథ్యం అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. ఉచిత విద్య, వైద్యం, పక్కాగృహాల నిర్మాణం, పంట నష్టపరిహారం హామీలను అమలు చేసి తీరుతాం అని అన్నారు. ప్రజలకు మేలు చేసే ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని రద్దు చేయబోం. మరింత మెరుగ్గు అమలు చేస్తాం అని తెలిపారు.

కేసీఆర్ నియంత పాలనను ఎండగట్టి ప్రజలకు భరోసా కల్పించేందుకు పాదయాత్ర చేస్తున్న‌ట్లు తెలినారు. పాదయాత్రను అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర ప‌న్నుతున్నార‌ని.. కేసీఆర్ కుట్రలను తిప్పికొడతాం... గడీల పాలనను బద్దలు కొడతాం అని అన్నారు. బీజీపీ ఆధ్వర్యంలో పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు.


Next Story