సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన బండి సంజ‌య్‌

Bandi Sanjay Fire On CM KCR. ఎమ్మెల్సీ క‌విత‌ను బీజేపీలోకి చేర్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై

By Medi Samrat  Published on  16 Nov 2022 4:10 PM GMT
సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన బండి సంజ‌య్‌

ఎమ్మెల్సీ క‌విత‌ను బీజేపీలోకి చేర్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ''తన అధికారం కోసం.. కుటుంబ సభ్యులను కూడా వాడుకునే నీచుడు కేసీఆర్.. చివరకు తన బిడ్డను బీజేపీలోకి లాగాలని చూస్తుందని సిగ్గులేకుండా చెబుతున్నడని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్ నే ఎవడూ దేఖడం లేదు.. ఆయన బిడ్డను పట్టించుకునేదెవడు?'' అంటూ ఎద్దేవా చేశారు. పార్టీలోకి లాగాలని చూసే పార్టీని చెప్పుతో కొట్టాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిప‌డ్డారు. ఇతర పార్టీల నుండి గెలిచిన 37 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా.. సిగ్గు లేకుండా టీఆర్ఎస్ లోకి చేర్చుకున్నడు.. మరి ఆయనను ఏ చెప్పుతో కొట్టాలో ఆలోచించండి..'' అంటూ విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎవరైనా అబివృద్ధి కార్యక్రమాలు మాట్లాడతారేమోనని.. సంక్షేమ పథకాల గురించి మాట్లాడటం లేదు. ఎన్ని లంగా పనులైనా.. రాజకీయాలైనా చేసి గెలవాలనుకుంటున్నడని మండిప‌డ్డారు. ఎంతసేపటికి ఇతర పార్టీల నేతలను గుంజాలే.. ఇతర పార్టీలపై బురద చల్లాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నడని ఆరోపించారు. న‌లుగురు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఎందుకు బయటకు రావడం లేదో.. గంప కింద ఎందుకు కమ్మి పెట్టిండో అర్ధం కావడం లేదు.. సీఎంకు దమ్ముంటే దక్కన్ కిచెన్ హోటల్, ఫాంహౌజ్, ప్రగతి భవన్ లోని సీసీ పుటేజీలను సేకరించి విచారణ జరపాల‌ని డిమాండ్ చేశారు.

మేం హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలోనే సిట్ విచారణ జరపాలని కోరినం. మా పిటిషన్ ను స్వీకరించి ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ మారాలనే వాళ్లను చెప్పుతో కొట్టాలన్నడు.. 37 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నడు.. మరి ఆయనను ఏ చెప్పుతో కొట్టాలె? బీజేపీకి వచ్చే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి రావాలి. భేషరతుగా.. అదే మా సిద్దాంతం? మరి మీ సంగతేంది? అంటూ ప్ర‌శ్నించారు. ముందస్తు ఎన్నికలు విష‌యంలో కేసీఆర్ చెప్పింది ఉల్టా జరుగుతుంది. జరగవని అన్నడంటే.. కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళతాడని అర్ధం.. మేం దేనికైనా సిద్దంగా ఉన్నాం. ఎప్పుడు ఎన్నికలొచ్చినా రడీ అని స‌వాల్ విసిరారు.

బీజేపీ అధికారంలోకి వస్తుందని లక్ష్యం. అందుకే గెలుపు కోసం అడ్డదారులైనా తొక్కాలని కేసీఆర్ తన ఎమ్మెల్యేలను నిర్దేశిస్తున్నడని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తోందే కేసీఆర్.. ఎమ్మెల్యేలందరి ఫోన్లు ట్యాప్ చేస్తోంది.. ఆయనే.. ఇజ్రాయిల్ టెక్నాలజీని వాడుతున్నది ఆయనే.. నాకు జైళ్లు కొత్త కాదు.. కేసులు కొత్త కాదు.. కొప్పుల ఈశ్వర్ కు కొంచెమైనా ఉండాలే... ప్రెస్ మీట్ లో కూర్చోనీయకుండా పక్కకు తోసిన కేసీఆర్ ను పొగుడుతున్నాడ‌ని విమ‌ర్శించారు.


Next Story