డ్రగ్స్ దందా వెనుక సీఎం సన్నిహితులతో పాటు టీఆర్ఎస్ నేతల హస్తముంది

Bandi Sanjay Fire On CM KCR. రాష్ట్రంలో కొనసాగుతున్న డ్రగ్స్ దందా వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితులతో పాటు

By Medi Samrat  Published on  8 April 2022 1:07 PM GMT
డ్రగ్స్ దందా వెనుక సీఎం సన్నిహితులతో పాటు టీఆర్ఎస్ నేతల హస్తముంది

రాష్ట్రంలో కొనసాగుతున్న డ్రగ్స్ దందా వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితులతో పాటు టీఆర్ఎస్ నేతల హస్తముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. హైదరాబాద్ డ్రగ్స్ దందాకు అడ్డాగా మారడంతో దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రజలు తలదించుకునేలా చర్చ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2017 నుండే డ్రగ్స్ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, ప్రముఖుల ప్రమేయం ఉందని విచారణలో వెల్లడైందన్నారు. మరి నాటి కేసు విచారణ సంగతి ఏమైందని, ఈ కేసులో ఏం సాధించారో సమాధానం చెప్పాలన్నారు. నాటి కేసు రికార్డులను, ఆధారాలను సమర్పించాలని కేంద్ర సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమర్పించడం లేదని ప్రశ్నించారు.

ఈ వ్యవహారంపై ఈడీకి పూర్తి వివరాలివ్వాలని హైకోర్టు ఆదేశించినా.. చివరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఎక్సైజ్ కమిషనర్ కు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వివరాలు ఇవ్వడానికి భయపడుతోందని ప్రశ్నించారు. ఈ డ్రగ్స్ దందా వెనుక సీఎం సన్నిహితుల, టీఆర్ఎస్ నేతల హస్తం ఉందని.. ఈడీకి ఆధారాలు సమర్పిస్తే.. వారి పేర్లు బయటకు వస్తాయనే భయంతోనే సీఎం ఆ వివరాలివ్వకుండా తొక్కి పెడుతున్నారని ఆరోపించారు. డ్రగ్స్ దందాలో బీజేపీ సహా ఏ పార్టీ వాళ్ల ప్రమేయమున్నా వాళ్లను అదుపులోకి తీసుకుని డ్రగ్స్ పరీక్షలు జరిపి చర్యలు తీసుకోవాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. సీఎం డ్రగ్ పరీక్షలు చేసేందుకు ఎందుకు వెనుకాడుతున్నరని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ నేతలను కాపాడేందుకు సీఎం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. బీజేపీ చూస్తూ ఊరుకోదని అన్నారు.












Next Story