రేపటి నుండి బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర

Bandi Sanjay 5th Phase Praja Sangrama Yathra. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర రేపటి నుండి ప్రారంభం కానుంది

By Medi Samrat  Published on  27 Nov 2022 2:00 PM GMT
రేపటి నుండి బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర రేపటి నుండి ప్రారంభం కానుంది. ఈ యాత్ర ప్రారంభం ముందు నిర్వహించే సభలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొననున్నారు. ఐదో విడత పాదయాత్రలో భాగంగా భైంసా నుండి కరీంనగర్ వరకు యాత్ర సాగనుంది. 20 రోజుల పాటు 222 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం 5 జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో యాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 17వ తేదీ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. సోమవారం ఉదయం నిర్మల్ జిల్లా ఆడెల్లి పోచమ్మ అమ్మవారి కార్యాలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత బైంసాకు వెళ్లి పాదయాత్ర ప్రారంభించనున్నారు.

రేపు 6.4 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు. అనంతరం గుండగామ్ లో బండి సంజయ్ బస చేయనున్నారు. 29న గుండగామ్ నుండి మహాగన్, చటా మీదుగా లింబా వరకు కొనసాగనుంది. ఇక 3వ రోజు లింబా నుండి ప్రారంభమై కుంటాల, అమ్బకంటి మీదుగా బూజురుగుకు చేరుకోనుంది. ఈ మూడు రోజులు కూడా ముథోల్ అసెంబ్లీ నియోజవర్గంలోనే పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 1 నుండి 6 వరకు నిర్మల్ అసెంబ్లీ నియోగాజవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 2న రాంపూర్ నుండి లోలం మీదుగా చిట్యాల వరకు 3న చిట్యాల నుండి మంజులపూర్, నిర్మల్ రోడ్, ఎడిగం, ఎల్లపల్లి, కొండాపూర్ మీదుగా ముక్తపూర్ వరకు కొనసాగనుంది. 4న లక్ష్మణ్ చందా మండలంలో 5న మమ్డా మండలంలో, 6,7న ఖానాపూర్ నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. డిసెంబర్ 8,9 తేదీల్లో కోరుట్ల నియోజకవర్గంలో 21.7 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 10న కోరుట్ల పట్టణం మీదుగా వేములవాడ నియోజకవర్గానికి చేరుకోనుంది. డిసెంబర్ 11న మేడిపల్లి, తాటిపల్లి మీదుగా జగిత్యాల రూరల్ వరకు యాత్ర సాగనుంది. భారతీయ జనతా పార్టీకి మైలేజీని తీసుకుని రావడానికి బండి సంజయ్ పాదయాత్ర ఎంతగానో ప్లస్ గా మారింది. ఇప్పుడు మరోసారి ప్రజల్లోకి మరింతగా బీజేపీని తీసుకుని వెళ్లడానికి బండి సంజయ్ టార్గెట్ పెట్టుకున్నారు.


Next Story