వీహెచ్ ను ప‌రామార్శించిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ

Bandaru Dattatreya Visits Congress Leader VH House. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌

By Medi Samrat  Published on  21 July 2021 4:02 PM IST
వీహెచ్ ను ప‌రామార్శించిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ

హ‌రియానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ వి. హనుమంతరావు(వీహెచ్‌)ను ప‌రామార్శించారు. బుధ‌వారం ఉద‌యం అంబర్ పేటలోని వీహెచ్ నివాసానికి వెళ్లిన దత్తాత్రేయ ఆయ‌న‌ను పరామర్శించారు. వీహెచ్‌ ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. వీహెచ్‌ నిరంతరం ప్రజల కోసం పోరాడే వ్యక్తి అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాటం చేసిన వ్యక్తి హనుమంతరావు అని తెలిపారు.


తాను నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి వీహెచ్‌ రెగ్యులర్ గా వస్తుంటారని.. ఆయనకు, నాకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయంతోనే పరామర్శించటానికి వచ్చానని దత్తాత్రేయ అన్నారు. వీహెచ్‌ పూర్తిగా కోలుకొని, మళ్లీ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, భగవంతుణ్షి ప్రార్దిస్తున్నానని దత్తాత్రేయ అన్నారు. ఇదిలావుంటే.. బండారు దత్తాత్రేయ ఇటీవ‌లే హ‌రియానా గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అంత‌కుముందు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్నారు.


Next Story