ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన బల్మూరి వెంకట్, మహేష్ కుమార్‌ గౌడ్

ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎమ్మెల్సీలుగా ఎన్ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్

By Medi Samrat  Published on  22 Jan 2024 5:23 PM IST
ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన బల్మూరి వెంకట్, మహేష్ కుమార్‌ గౌడ్

ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎమ్మెల్సీలుగా ఎన్ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవులకు ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వీరిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు ఈ రెండు స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా.. ఇప్పటి వరకు రెండు స్థానాలకు రెండు నామినేషన్లే వచ్చాయి. పోటీ ఎవరూ లేకపోవడంతో ఎన్నిక నిర్వహించకుండానే అసెంబ్లీ కార్యాలయం బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్‌లను ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ప్రకటించింది. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మహేష్ గౌడ్, వెంకట్‌లకు అభిమానులు, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Next Story