హుజురాబాద్ ఉప ఎన్నిక నేఫథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలమూరి వెంకట్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థి బలమూరి వెంకట్ మాట్లాడుతూ.. విద్యార్ధుల పక్షాన కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో పెట్టారని అన్నారు. కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలంటూ ఎమ్మెల్యే సీతక్కతో కలిసి అమరణ నిరాహార ధీక్షలో కూర్చున్నామని.. అప్పటి ఆరోగ్య మంత్రి, ఇప్పటి బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం స్పందించలేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యతిరేకత బయటపడకుండా ఉండటానికే ఇరు పార్టీలు కొట్లాడుకుంటున్నట్లు నిస్తున్నాయని వెంకట్ అన్నారు. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ లా ఉంది బీజేపీ, టీఆర్ఎస్ ల తీరని ఎండగట్టారు.
హుజురాబాద్‌లో 36,000 మందికి పైగా నిరుద్యోగులున్నారని.. 25000 మందికి ఫీజు రీఎంబర్స్‌మెంట్ రాక విద్యకు దూరమయ్యారని.. దాదాపు 60,000 మంది పక్షాన పోరాడేందుకు కాంగ్రెస్ అధిస్టానం అభ్యర్ధిగా నన్ను బరిలో నిలిపిందని ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు లు శ్రీధర్ బాబు, సీతక్క, వర్కింగ్ ప్రసిడెంట్స్ గీతారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుసేన్ తదితరులు పాల్గొన్నారు.