వివేక్‌పై సీఈఓ వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేసిన బాల్క సుమన్
చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్‌పై సీఈఓ వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశామని బాల్క సుమన్ తెలిపారు.
By Medi Samrat Published on 15 Nov 2023 5:00 PM ISTచెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్‌పై సీఈఓ వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశామని బాల్క సుమన్ తెలిపారు. వివేక్ తనకు చెందిన విజిలెన్స్ అనే కంపెనీకి 8 కోట్ల నిధులు బదిలీ అయ్యాయని.. కోట్ల రూపాయలతో వివేక్ అందరినీ కొంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి రామగుండంకు నిధులు బదిలీ అయ్యాయని.. ఈసీఐ ప్రతినిధి అయిన అబ్జర్వర్‌ను ను కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. వివేక్ కు సంబంధించిన అన్ని సంస్థల కంపెనీలపై ఈసీఐ నిఘా పెట్టాలని కోరామని వెల్లడించారు.
తన కుటుంబ సభ్యులకు, పెట్రోల్ బంక్ అండ్ రైస్ మిల్లులకు, మార్కెట్ వాళ్లకు వివేక్ నిధులు పంపుతున్నారని ఆరోపించారు. కరీంనగర్, మంచిర్యాల, మందమర్రి, చెన్నూరులలో వ్యాపారులకు వివేక్ కు నిధులు పంపిణి చేస్తున్నారని ఆరోపించారు. వివేక్ కొడుకు, బిడ్డ, అల్లుడు, విశాఖ సంస్థల సిబ్బంది చెన్నూరు లో వివేక్ కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
అంగిలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చిన వివేక్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. బీజేపీ మ్యానిఫస్టో కమిటీ చైర్మన్ గా వివేక్ మొన్నటి వరకూ ఉన్నారు. వివేక్ వల్ల బీజేపీ ఇప్పటికీ మ్యానిఫెస్టో ప్రకటించలేదన్నారు. 30ఏళ్లు చెన్నూరును పాలించి అభివృద్ధి అంటే ఏంటో ప్రజలకు తెలియదన్నారు.
బాల్క సుమన్ వేల కోట్లు సంపాదిస్తే వివేక్ లెక్క విశాఖ లాంటి సంస్థలు పెట్టే వాడినన్నారు. 4 ఏళ్లు వివేక్ చెన్నూరు లో కనిపించలేదన్నారు. ఇంట్లో ఉంచుకోకుండా ఆరోగ్యం పట్టించుకోకుండా.. హాస్పిటల్ లో పెయిడ్ నర్సులను పెట్టి పట్టించుకోలేదు.. సొంత తండ్రినే పట్టించుకోని వివేక్.. చెన్నూరు ప్రజలను పట్టించుకుంటారా? అని ప్రశ్నించారు.
వివేక్ మొదటి నుంచి కార్పొరేట్ రాజకీయాలు చేశారని ఆరోపించారు. సామంతరాజు లెక్క ఉరుకొకరిని పెట్టుకోని, ప్యూడలిజం పాలన వివేక్ చేశారని అన్నారు. ధన రాజకీయాలు చేసే వివేక్ లాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి పట్టిన దయ్యాలు అని అభివర్ణించారు. కోట్ల రూపాయలు వెదజల్లి నన్ను ఓడగొట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. డబ్బు అహంకారానికి - చెన్నూరు ఆత్మగౌరవానికి, వేల కోట్లు ఉన్న వ్యక్తికి - వేల కోట్లు తెచ్చే వ్యక్తికి పోటీ అని పేర్కొన్నారు.
వివేక్ పై ఈడీకి ఫిర్యాధు చేస్తామని అన్నారు. చెన్నూరు అభివృద్ధిపై అక్కడ ఏ చౌరస్తా లోనైనా చర్చకు సిద్ధమన్నారు. నన్ను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. నేను వ్యక్తిగతంగా అనాలంటే అనగలనన్నారు. ఆవుల మందపై తోడేళ్ళు పడ్డట్లు వివేక్ తన బలగంతో చెన్నూరుకి వచ్చారని ఆరోపించారు.