తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాలెంటైన్స్ డే శుభాకాంక్షల కార్డులను తగులబెట్టే కార్యక్రమాలను నిర్వహించినట్లు హిందుత్వ గ్రూప్ బజరంగ్ దళ్ ఆదివారం ప్రకటించింది. ఫిబ్రవరి 14న జరుపుకునే వాలెంటెన్స్ డే ను నిరసిస్తూ బజరంగ దళ్ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విశ్వ హిందూ పరిషత్ యువజన విభాగం కూడా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కార్యక్రమాలను నిర్వహించవద్దని ప్రజలను హెచ్చరించింది. ఇలాంటి సంస్కృతిని వ్యాపారస్తులు కూడా ప్రోత్సహించవద్దని చెప్పారు. వాలెంటెన్స్ డే రోజు జరుపుకునే వారికి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఉంటుందని హెచ్చరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 120 చోట్ల ఈ కార్యక్రమాలు జరిగాయని తెలంగాణ భజరంగ్ దళ్ కన్వీనర్ శివరాములు వీడియో సందేశంలో తెలిపారు. ''ఫిబ్రవరి 14న, పుల్వామాలో మరణించిన సైనికుల అమరవీరుల స్మారక కార్యక్రమాలను అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిర్వహించాలని మేము నిర్ణయించుకున్నాము. కొంతమంది వ్యక్తులు తమ వ్యాపారాలను ప్రోత్సహించడానికి వాలెంటైన్స్ డే ఈవెంట్‌లను నిర్వహిస్తున్నారని మేము తెలుసుకున్నాము. గతంలో కూడా అలా చేయవద్దని కోరాం. కానీ వారు ముందుకు వెళితే, మేము ఖచ్చితంగా వారిని అడ్డుకుంటాము'' అని అతను చెప్పారు. రైట్‌వింగ్ గ్రూప్ ' వాలెంటైన్స్ డే బంద్ కరో ', ' జై శ్రీరామ్ ' నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించింది .