ఆర్టీసీ చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
Bajireddy Govardhan Appointed As RTC Chairman. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా నియమించారు
By Medi Samrat Published on
16 Sep 2021 9:54 AM GMT

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. బాజిరెడ్డి ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తనను ఆర్టీసీ చైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే గోవర్ధన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాజిరెడ్డి గోవర్ధన్ సిరికొండ మండలం రావుట్లలో జన్మించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కీలక నేతగా ఎదిగిన బాజిరెడ్డి గోవర్ధన్.. టీఆర్ఎస్ పార్టీ తరపున 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో ఆర్మూర్ నుంచి, 2004లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి విజయబావుట ఎగురవేశారు. అంతకుముందు 1994లో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటిచేసి ఓడిపోయారు బాజిరెడ్డి గోవర్ధన్.
Next Story