బైరి నరేష్‌ను పరిగి సబ్ జైలుకు త‌ర‌లించిన పోలీసులు

Bairi Naresh Arrest. అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ను వికారాబాద్ జిల్లా

By Medi Samrat  Published on  31 Dec 2022 7:30 PM IST
బైరి నరేష్‌ను పరిగి సబ్ జైలుకు త‌ర‌లించిన పోలీసులు

అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ను వికారాబాద్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి పరిగి సబ్ జైలుకు తరలించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ తో పాటు కార్యక్రమ నిర్వాహకుడు డోలు హనుమంతును వికారాబాద్ జిల్లా పోలీసులు వరంగల్ లో అదుపులోకి తీసుకొని, కొడంగల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచి పరిగి సబ్ జైలుకు తరలించారు. నరేష్ ను పరిగి జైలుకు తీసుకొస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న అయ్యప్ప స్వామి భక్తులు..పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకొని బైరి నరేష్ కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడంతో ఉదృత పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య కాసేపు తోపులాట చోటు చేసుకోగా.. ఆందోళకారులను చెదరగొట్టిన పోలీసులు నరేష్ ను పరిగి జైలుకు త‌ర‌లించారు.





Next Story