మందుబాబులకు బ్యాడ్ న్యూస్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణకు హీనెకెన్, కింగ్‌ఫిషర్ బీర్ సరఫరాలను యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ నిలిపివేసింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Jan 2025 5:27 PM IST
మందుబాబులకు బ్యాడ్ న్యూస్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణకు హీనెకెన్, కింగ్‌ఫిషర్ బీర్ సరఫరాలను యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ నిలిపివేసింది. పెండింగ్ బకాయిల కారణంగా బీర్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది.

తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టిజిబిసిఎల్) బీర్ సరఫరాలకు సంబంధించి పెద్ద మొత్తంలో బకాయిలు ఉంచిందని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యుబిఎల్) బుధవారం తెలిపింది. యునైటెడ్ బ్రూవరీస్ తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కింగ్‌ఫిషర్, కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్, కింగ్‌ఫిషర్ అల్ట్రా, కింగ్‌ఫిషర్ అల్ట్రామాక్స్ వంటి ప్రముఖ బీర్ బ్రాండ్‌లను తయారు చేస్తోంది. "SEBI లిస్టింగ్ రెగ్యులేషన్ 30కి అనుగుణంగా, టిజిబిసిఎల్ కి బీర్ సరఫరాను తక్షణమే నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది" అని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

తెలంగాణ బెవరేజస్‌ కార్పొరేషన్‌ నుంచి తమకు 900 కోట్లు బకాయి ఉందని, 2019 నుంచి ధరలను సవరించకపోవడంతో నష్టాలు వస్తూ ఉండడంతో యూబీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ యూబీ సంస్థకు ప్రతి 45 రోజులకోసారి బకాయిలు చెల్లించాల్సి ఉండగా, నాలుగు నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.

బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) పరిశ్రమ ఆర్థిక సమస్యల గురించి తెలంగాణ ప్రభుత్వానికి అనేక ప్రతిపాదనలను అందించిందని, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది, అయితే ఎటువంటి పరిష్కారం తీసుకోలేదు.

ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, కార్పొరేషన్ తన ఉద్యోగులను ఆదుకోవడానికి కట్టుబడి ఉంది. రాష్ట్ర ఆదాయానికి 4,500 కోట్ల రూపాయల ఆదాయం అందిస్తూ ఉంది. రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం, బీర్ ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడానికి తెలంగాణ ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని కోరింది.

Next Story