డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్ బి. అజిత్ రెడ్డిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డి)గా గురువారం నియమించారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అజిత్ రెడ్డి డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్‌గా ఉన్నారు. గతంలో ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవోగా పని చేశారు.
ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) లో ఇద్దరు అదనపు బ్యూరోక్రాట్‌లను సెక్రటరీలుగా నియమించాలని భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ మాజీ కమిషనర్ లోకేష్ కుమార్, మాణిక్క రాజ్ సీఎంవో అదనపు సెక్రటరీలుగా నియమించాలని చూస్తున్నారు. లోకేష్ కుమార్‌ను రిలీవ్ చేయడానికి ఎన్నికల సంఘం నుండి క్లియరెన్స్ పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుతం కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో పనిచేస్తున్న మాణిక్క రాజ్‌ను రాష్ట్రానికి రప్పించాల్సిన అవసరం ఉంది.