మంత్రి మల్లారెడ్డికి అవార్డు

మంత్రి మల్లారెడ్డిని ఇండియా బుక్ ఆఫ్ రికార్డు అవార్డు వరించింది.

By Medi Samrat  Published on  15 Aug 2023 9:02 PM IST
మంత్రి మల్లారెడ్డికి అవార్డు

మంత్రి మల్లారెడ్డిని ఇండియా బుక్ ఆఫ్ రికార్డు అవార్డు వరించింది. మెడికల్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి అవార్డు రావ‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేశారు. మ‌రోమారు పాలమ్మిన‌.. పూలమ్మిన.. కష్టపడ్డ.. కాలేజీలు పెట్టినా.. మెడికల్ కాలేజీలు పెట్టానా.. ఎంపీ అయినా.. ఎమ్మెల్యే అయినా.. మినిస్టర్ అయినా.. ఈరోజు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించాను అంటూ ఆనందంతో కేరింతలు కొట్టారు.

తన కష్టానికి ఫలితమే విజనరీ మ్యాన్ అవార్డు అని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదం వల్లే ఇంతవాడిని అయ్యానన్నారు. కాలేజీలు పెట్టి డాక్టర్లు, ఇంజినీర్లను తయారు చేయడం గర్వంగా ఉందన్నారు. అందరూ కష్టపడాలి విజయం సాధించాలన్నారు. అందరి ముందు ఈ అవార్డు తీసుకోవడం ప‌ట్ల‌ నా జన్మ ధన్యమైంది మంత్రి మల్లారెడ్డి అన్నారు.

Next Story