Telangana : 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌

ఆటో డ్రైవర్ల డిమాండ్ల సాధనకు వచ్చే నెల 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌ చేపట్టడంతో పాటు

By Medi Samrat
Published on : 22 Nov 2024 10:28 AM IST

Telangana : 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌

ఆటో డ్రైవర్ల డిమాండ్ల సాధనకు వచ్చే నెల 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌ చేపట్టడంతో పాటు హైదరాబాద్‌లో లక్ష మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్స్‌ యూనియన్‌ జేఏసీ వెల్లడించింది. హైదరాబాద్‌లో గురువారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన రాష్ట్ర సదస్సులో ఈ మేర‌కు ప్రకటన చేశారు. సదస్సులో యూనియన్ నాయకులు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.

డ్రైవర్ల ఆందోళనలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ లాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హైదరాబాద్‌లో కొత్తగా 20 వేల ఆటో పర్మిట్‌లు జారీ చేయాలని.. ఆటోలకు థర్డ్ పార్టీ బీమా అమలు చేయాలని.. ప్రమాద బీమా కవరేజీని రూ.10 లక్షలకు పెంచాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది. అదనంగా ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి తక్షణమే 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని వారు పిలుపునిచ్చారు.

Next Story