ఎమ్మెల్యే కారట.. సైడ్ ఇవ్వని తెలంగాణ ఆర్టీసీ బస్సు.. ఆ తర్వాత ఏమి చేశారంటే..

Attack On RTC Driver. తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్యే కారుకు సైడ్ ఇవ్వలేదంటూ

By Medi Samrat  Published on  7 Nov 2021 12:45 PM GMT
ఎమ్మెల్యే కారట.. సైడ్ ఇవ్వని తెలంగాణ ఆర్టీసీ బస్సు.. ఆ తర్వాత ఏమి చేశారంటే..

తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్యే కారుకు సైడ్ ఇవ్వలేదంటూ బూతు పదాలతో విరుచుకుపడ్డారు. చేతిలో కర్ర పట్టుకుని దిగు అంటూ డ్రైవర్‌పై దాడికి యత్నించారు. బెంగళూరు హైవేపై షాద్ నగర్-బాలానగర్ మధ్య ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే కారుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని.. ఓవర్ టేక్ చేసి బస్సుకు అడ్డంగా కారు నిలిపారు. కారు దిగి రెచ్చిపోయారు. ఆర్టీసీ డ్రైవర్‌పై బూతులు తిట్టారు.. ఎమ్మెల్యే కారుకే సైడ్ ఇవ్వవా? అంటూ నోటికొచ్చినట్లు తిట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

"ఏం రా.. ఏమనుకుంటున్నావు.. మా సార్‌ వాహనానికే సైడ్‌ ఇవ్వవా" అంటూ రాయడానికి కూడా వీలు లేని భాషతో తిట్టారు. కర్రతో బస్సు అద్దాలపై కొడుతూ డ్రైవర్‌ ను బెదిరించారు. హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఇక కారు నెంబర్ ప్లేట్ మీద ఉన్న ఛలానాలపై కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే వాహనం(TS09FA0809)గా చెబుతున్న కారు కోచర్ల వినోద్ పేరుపై రిజిస్టర్ అయి ఉంది. ఈ కారుపై ట్రాఫిక్ పోలీసులు 14 చలానాలు విధించారు. అందులో 12 ఓవర్ స్పీడ్ చలానాలు ఉన్నాయి. ఇన్ని చలానాలు పెండింగ్‌లో ఉన్నా పోలీసులు చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి.


Next Story