Telangana: సొంత చెల్లిపై అన్న అత్యాచారం.. గర్భవతి కావడంతో..

సభ్య సమాజం తలదించుకునే ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు తన సొంత చెల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  14 July 2024 7:00 PM IST
Nagar Kurnool district, Crime, Telangana

Telangana: సొంత చెల్లిపై అన్న అత్యాచారం.. గర్భవతి కావడంతో..

సభ్య సమాజం తలదించుకునే ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు తన సొంత చెల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కామంతో కాటు వేసి గర్భవతిని చేశాడు. ఈ ఘటన జిల్లాలోని బిజినపల్లి మండలం కీమ్యాతాండలో చోటుచేసుకుంది. తండాలో నివాసం ఉంటున్న ఓ మహిళకు కూతురు, కుమారుడు ఉన్నారు. 13 ఏళ్ల వయసు ఉన్న సొంత చెల్లికి మాయమాటలు చెప్పి అన్న.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అత్యాచారానికి పాల్ప డ్డాడు. ఇలా కామంతో సొంత చెల్లెలితోనే సంబంధం పెట్టుకోవడంతో చివరకు ఆ బాలిక గర్భం దాల్చింది.

15 రోజుల క్రితం వనపర్తి జిల్లా గోపాల పేట మండలంలోని బుద్దరం అటవీ ప్రాంతంలో అన్నా చెల్లెలు తిరిగినట్లు తెలిసింది. మర్నాడు ఖిల్లఘనపురంలో అన్నా చెల్లెలిద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే స్థానికులకు అనుమానం వచ్చి 1098 చైల్డ్ లైన్ కి సమాచారంఇచ్చారు. దీంతో వనపర్తి చైల్డ్ లైన్ అధికారులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకుని మహబూబ్‌నగర్ టూటౌన్ కి బదిలీ చేశారు. అక్కడి పోలీసులు బిజినపల్లి పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. బాలికకు వైద్య పరీక్షల నిమిత్తం నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం ఈ విషయాన్ని బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పింది. తల్లి ఫిర్యాదు మేరకు బిజినపల్లి పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story