బాబు కోసం మృత్యుంజయ హోమాన్ని చేయబోతున్నా: వేణు స్వామి

శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని వేణు స్వామి తెలిపారు.

By Medi Samrat  Published on  25 Dec 2024 4:58 PM IST
బాబు కోసం మృత్యుంజయ హోమాన్ని చేయబోతున్నా: వేణు స్వామి

శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని వేణు స్వామి తెలిపారు. బాబు కోసం ఈ వారంలో మృత్యుంజయ హోమాన్ని తన సొంత ఖర్చులతో చేస్తానని తెలిపారు. 2 లక్షల రూపాయలు భాస్కర్ కు ఇస్తున్నానని వేణు స్వామి చెప్పారు. శని ఉండడం వల్ల అల్లు అర్జున్ కు ఈ సంఘటన జరిగిందని, అల్లు అర్జున్ జాతకం మార్చి 29 వరకు బాగోలేదన్నారు. 'పుష్ప-2' ప్రీమియ‌ర్ షో తొక్కిస‌లాట‌లో మృతి చెందిన రేవ‌తి కుటుంబానికి వేణుస్వామి ఆర్థిక సాయం చేశారు. రేవ‌తి భ‌ర్త భాస్క‌ర్‌కు రూ. 2ల‌క్ష‌ల చెక్కును ఆయ‌న అంద‌జేశారు.

శ్రీతేజ్ ను చూసేందుకు అల్లు అరవింద్, దిల్ రాజు, సుకుమార్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ ను, ఆయన తండ్రిని పరామర్శించారు. శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు. అల్లు అర్జున్ తరపున రూ. కోటి, 'పుష్ప-2' నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ. 50 లక్షలు ఇచ్చారని తెలిపారు. శ్రీతేజ్ ఇప్పుడు కోలుకుంటున్నాడని, వెంటిలేటర్ తీసేశారని అల్లు అర్జున్ తెలిపారు.

Next Story